Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

కుజ దోషం నివారణ మార్గం -ఏది ఎలా ఎప్పుడు చేయాలి?


మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని  నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

             వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని  అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది

               అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి  అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి
 

మన తెలుగు సాంప్రదాయం-మన ఉగాది


                             తెలుగు  సంప్రదాయానికి ప్రతీక.... మన ఉగాది

తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చేదే ఉగాది.అంతే కాదు.అంతకు ముందున్న స్లేషం,వాతపు నొప్పులు,అస్తవ్యస్తంగా ఉన్న మన ఆరోగ్యానికి క్రొత్త జీవాన్ని ఇచ్చే సందడి ఈ పర్వ దినం. వీటిన్నిoటితో పాటు ఉగాదికి మరో ప్రాముఖ్యం ఉంది.ఈ [పండుగకు మాత్రమే తినేది ఉగాది పచ్చడి తీపి,పులుపు,కారం,ఉప్పు,వగరు,చేదు అనే ఆరు రుచుల కలిసిన ఉగాది పచ్చడిని తింటాం

  " మాసానాం మార్గశిర్మోహం...రుతూనాం కుసుమాకర... అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పారు.మాసాల్లో మార్గశిర మాసం రుతువుల్లో వసంత రుతువు ఉత్తమమైనది.మన పండుగలు అన్ని రుతువులఫైనే ఆధారపడి ఉంటాయి.ఉగాది వసంత రుతువులో వస్తుంది.అ రోజుల్లో ప్రకృతి అత్యంత రమణియంగా ఉంటుంది.తరుశాఖల చిగురులు.. పక్షుల కిల కిలారావాలు.. మామిడి చిగుళ్ళును ఆస్వాదించిన కోకిలల ఆలావనలు..అలా పరవశించిన ప్రకృతి ఒడిలో అందరూ ఉగాది సంబరాలు జరుపుకొంటారు ఉగాది పండుగ రావడంతో తెలుగిళ్ళు కళ కళలాడుతుంటాయి.ఎవరెన్ని కష్టాల్లో ఉన్నప్పిటికీ ఆ రోజున మాత్రం ఆనందంగా గడుపుతారు.ఎందుకంటే ... సంవత్సరం ప్రారంభం రోజున ఎలా ఉంటె... సంవత్సరం అంతా అలానే ఉంటారనేది నమ్మకం


               ఉగాది పచ్చడి- ప్రాముఖ్యం

ఉగాదినాడు బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి.నూతన వస్త్రాలను ధరించాలి.గడపకు పసుపు కుంకుమ,గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి.భగవంతున్ని ప్రార్ధిoచాలి. ప్రధానంగా ఉగాది రోజున భగవంతుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి ఉంచడం తప్పనిసరి.


 క్రొత్త నిర్ణయాలు తీసుకొనేందుకు పంచాంగా శ్రవణం చేయడం ఉగాది నాడు విశిష్టత.పంచాంగం అంతే అయిదు అంగములు అని అర్ధం.తిధీ,వారం,నక్షత్రం,యోగం,కరణం అనేవి ఆ అయిదు అంగాలు 15 తిధులు,7 వారాలు,27 నక్షత్రములు,27 ,11కరణములు ఉన్నాయి.వీటిన్నిoటిని తెలిపేదే పంచాంగం.వీటిని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు అంటుoటారు.