Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు-నివారనోపాయలు

                                          రాహు గ్రహ ఆరాధనా రహస్యాలు
విదేశీయుల పద్దతి ప్రకారం రాహువు గ్రహం కాదు. పరాశురుడు కూడా గ్రహంగా అంగికరించలేదు.ప్రాచీనులు రాహువును ఛాయా గ్రహం అని అన్నారు. ఛాయా అనగానే ఇంకొక దానికి నీడ లేదా ప్రతిబింబము అని అర్ధం.అందుకే మన ఆర్యులు "శనివత్త్ రాహు" అని శని గ్రహానికి బదులుగా రాహువని బావించారు.రాహువును గ్రహం అనుట కంటే విధ్యుదయ స్కంతావరణ మనుట సమంజసం.అన్ని గ్రహాలు  రవి వలన అస్తంగతులైతే,రవి చంద్రులను సహితం నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు.అందుకే ఈయన స్త్రోతంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు కలదని చెప్పబడింది.ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని,మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ద్దించే శక్తీ కలదు.కావునే రాహు మహా దశః భాగులేనివారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు.

పురాణాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కస్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు పార్ధవా నామ సంవత్సర భద్రా పద పౌర్ణమి  పూర్వభద్రా నక్షత్రామందు జన్మించాడు.మ్లేచ్చ స్వభావం కలిగినవాడు.సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహునుడై,కరాళ వక్త్రంతో  ఉప విష్ణుడై వుంటాడు

                                            రాహు గ్రహ సామర్ద్యాలు

క్రోత్తదాన్ని దేన్నీయినా తెచ్చి పెట్టీ స్వభావం రాహువునిది.శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ,మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు కానీ,అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయిoచే శక్తి కలవాడు.అబద్ధాలు,అల్లకల్లోలాలు,క్రొత్త అలవాట్లు.క్రొత్త వేష భాషలు కల్గించడంలో సిద్దహస్త్తుడు.గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువూ తలగా రాహువును,తోకగా కేతువును ప్రతికలుగ చిత్రీకరించారు.శని వాలే రాహువు కర్మ గ్రహం.పూర్వ జన్మ కర్మల్ని అతివిడ్డురంగా అనుబవింపచేయగలడు.దుర్మార్గ స్వభావం కలవారు అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత నివ్వడానికి,రాహువు బాగా సహకరిస్తాడు.రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు.కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ,అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత,తల్లి,అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా,అనుబవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనెడి లోకోక్తి అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే.ఫారిన్ భాషలు,ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం

                                                రాహువు కారకత్యాలు

రాజ్యాధికారం కల్పించుటలో ,పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు
వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో ప్రభావం కలవాడు.
కుట్రలు,పన్నాగాలు,ఎత్తు గడలు,కులద్రోయుట వంటి నీచ గుణాలు కల్గిస్తాడు
సాంప్రదాయాల సంస్కరణకు,మతబ్రస్థత్వాం పట్టిస్తాడు.
తక్కువ స్టితికల  స్త్రీ సాంగత్యానికి పూరి కోల్పుతాడు.
సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు.
వ్యసనపరులుగా,తిరుగుభోతులుగా మర్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు.
నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు
పీడ కలలు,భయదోళనలు కల్పిస్తాడు.
రహస్య స్టావరాల పనులు,రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు
వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు
ఉర్దూ,పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు

                                           రాహువు కల్గించే భాదలు

స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట
ముర్ఖునిగా ప్రవర్తించుట,అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట
ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు,పొలిసు గూడచారి సంస్తల వల్ల భాద కలుగును
కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట
కోర్టు వ్యవ`హరల్లో ఇరుక్కు పోవుట
మిలటరీ సంబంధ, బిల్డింగ్  కాంట్రాక్టు సంబంధ నష్టాలు
పాములు, తేళ్ళు,గేదెలు,విష జంతువుల వల్ల భాధలు
విష గ్యాసులు,ఆమ్లాలు,వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు
నూన్యత భావం
ఎక్కడికో పారి పోదామనే మానస్చాంచల్యం
జైలు వరకు తెసుకొని వెళ్ళుట చేయిస్తాడు
చంద్రునితో కలిస్తే  గొప్ప బుద్ధి చాంచల్యం కానీ పిచ్చి కానీ కల్గించవచ్చును.
కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు,దెబ్బ లాటలు,గాయాలు కల్గిస్తాడు
రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు
శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును
గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్టితిలలో తప్పులు చేయిస్తాడు
ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్ఘతం చేసి పరువు తీయిస్తాడు
రాహువు ఎంత యోగం కల్గించినా,ఎంతో కొంత అప్రతిస్ట్ట చేయకుండా ఉండలేడు


                                                  రాహువు కల్గించే రోగాలు

రాహువు వాయుతత్వ కారకుడు అవడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు  సంబంద రోగాలను కల్గిస్తాడు.నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు.,కడుపు,నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక.ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది.ఉరఃపంజర సంబంద రోగాలను కల్గిస్తాడు. శుక్రరాహువుల కలయికతో చర్మ సౌoధర్యన్ని దెబ్బ తీస్తాడు. సమస్త మైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ,మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు.కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను  కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి,బ్యాక్తిరియను ఆహ్వానించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం,కిళ్ళ వాతం, నడుము నొప్పి మడాల పగ్గులు కల్గుతాయి

                                                     రాహు గ్రహ నివారనోపాయలు

రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు,గౌ గోవులని కొందరు చెప్తారు.ప్రత్యదిదేవత సర్పములు,అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కల్గును
రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ ,కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును
చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును
రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంబించి వరుసగా 18 దినాలు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కల్గును
పడుకొనే ముందు గదిలో  నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కల్గును

1 comment:

  1. MGM National Harbor (MGM) launches new location in Washington
    MGM National Harbor (MGM) is 경상남도 출장마사지 set to open on 상주 출장안마 Thursday, October 14, 2020. As 계룡 출장마사지 the flagship 수원 출장안마 property of MGM Resorts International, MGM Resorts International 순천 출장마사지

    ReplyDelete