Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

స్వప్న ఫలితములు

                               


 సుస్వప్నములు
 మెడ, పర్వతం, రధము, గుర్రము, ఏనుగు, నీటిని చూచుట, ఎక్కుట, ప్రభువు లేక రాజు, తెల్లని ఎద్దు,ఆవు, దీపము, అన్నము, ఫలము, పుష్పములు, కన్య, అగ్ని, వేశ్య,తెల్లని పాము, మాంసము,ముత్యములు, మధ్యము, గంగా స్నానము, దేవా దర్సనం, పూర్ణ కుంభము, కన్యతో సంభోగం, వీటి వలన ఆరోగ్యం,ధనము,స్త్రీ లాభము కలుగును

దుస్వప్నములు

 క్రూర జంతువులు,అద్దములో తన ముఖము కనపడక పోవుట,కోతి తరుముట, గాడిద ఎక్కుట, పత్హి, నునే,ఎనుబోతు,ఉప్పు,ఇనుము, దొంగలు, రక్షక్ భటులు, బురద,నీటి యందు మునుగుట,రోగము వచ్చు నట్లు కనబడుట, వీటి వలన మృత్యు భయము, హాని కలుగును

బల్లి పడుటవలన ఫలితములు


శిరస్సున-కలహం
ముఖము నందు- బందు దర్శనం
ఫై పెదవి యందు- ధనావ్యయం
క్రింద పెదవి యందు ధనలాభం
ముక్కు చివరాన-రోగం
కుడి చెవి -దేర్ఘాయువు
ఎడమ చెవి- వ్యాపార లాభం
నేత్రముల యందు-ఖైదు
ముంగురుల యందు- శిక్ష
నుదురు యందు-భయము
కంటమునా-శత్రువు హాని
ఎడమ భుజామున- స్త్రీ భోగము
కుడి మణి కట్టు యందు- కీర్తి
స్తనముల యందు-దోషము
కడుపు మీద- ధనా లాభము
నాభి యందు- ధనా లాభము
పార్శ్వముల యందు-లాభము
తొడల యందు-పిత్రాజీతం
ప్రక్కల యందు-సుఖము
కాళ్ళ యందు-ధన వ్యయం
లింగమున- దారిద్రం
జుట్టు చివరన- మృత్యు భయం
తలమీద నుండి క్రిందకు దిగిన -హాని
క్రింద నుండి పైకి పాకిన,ప్రాకిన వెంటనే క్రిందకు దిగినను మంచిది


   శరీరంఫైనా ఎక్కడ బల్లి పడినాను వెంటనే శిర స్నానము చేసి నూనెతో దీపం పెట్టి దోష నివారణా చేసుకొని ,ఇష్ట్ట దైవ ప్రాద్దన చేసుకొవలెను

నాగ దోషం ,కాల సర్ప దోషం నివారనోపాయలు


                           కాల సర్పం యోగం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్ర్రావ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందమనే స్తితికి వస్తారు..

1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో  నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది

2.ఆరు ముఖాల రుద్రాఅక్షాలు చెవులకు లేదా గాజులలకు లేదా ఉంగరంగా ధరించుట వల్ల ,ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరంగా లేదా చేతికి కడియంగా ధరించుట వల్ల నివారణ పొందగలరు

3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.

4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి  నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును

5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణా కల్గును


తిరుమల గురించి కొన్ని నిజాలు




1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ సూచకములు


మనం నడిచే దారిలో స్త్రీ నెత్తిన మంచి నీళ్ళా బిందే కానీ కుండతో  కానీ మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి శుభ సూచకం

మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయిoచు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.

మనం నడిచే దారిలో మంగళివాడు తన  సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం

ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం

మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి

మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు

మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడి కి కుడి ప్రక్కన  క్రింద పడినచో అది శుభ సూచకం

మనం నడిచే దారిలో ఆవును,ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం

మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం

మన ఇంటిలో కానీ ,కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.

మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన  పెద్దలు

మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన  అది మనకు శుభ సూచకం

సకల కార్య సిద్దికి గణేశా పూజా విధానము- ఫలితములు

బాల గణేశుని శిరస్సు శివునిచే ఖండింపబడి, తిరిగి హస్తిముఖునిగా ప్రాణ ప్రతిస్ట్ట జరిగిన తరువాత ,ప్ర ప్రదమంగా తల్లి పార్వతి దేవి సిందూరాన్ని బొట్టుగా గణేశునకు పెట్టింది.ఆ కారణం చేత ఎవరైతే గణేశుని ప్రతి దినం సింధూరంతో పూజిస్తారో,వారి అడ్డంకులు అన్ని తొలగి విజయం కల్గుతుందని శ్రీ పార్వతి దేవి వరం ప్రసాదించింది.


ప్రతి నేల శుద్ధ చతుర్హి నాడు గణేశుని పూజించి,భాద్ర పద శుద్ధ చతుర్హ్హి అంటే వినాయక చవితి నాడు ఉద్వాసన చేసినచో లబించని సిద్దులంటే ఉండవు

 మార్గ శిర్ష శుద్ధ చతుర్ధిని " రమా చతుర్ధి " అంటారు. ఆ రోజున ఉపవసించి,విధి విధానంగా గరికలతో పూజించి,రాత్రి మొదట జామున కూడా పూజించ వలెను. గరికలు మూడు కణుపులు కలివిగా ఉండాలి. మట్టి, పగడం,జిల్లేడు వేరులతో ప్రతిమను చేయుట మంచిది. రాత్రి మొదటి జామున పూజాయైన పిదప, బాలచంద్రుని పూజించావలెను. తదుపరి విప్రులకు భోజనం పెట్టాలి.  రాత్రికి లవణ వర్జితమైన మదుర భోజనం తినాలి.ఈ  పూజా విధానం వలన సకల అడ్డంకులు తొలగి,అనుకొన్న సకల కార్యాలు  నెరవేరుతాయి.