గణపతి పురాణంలో పూర్వం కృతవీరుడు అనే ఒక మహారాజు సకల భోగ భాగ్యాలతో,సకల సిరి సంపదలతో మరియు అందమైన భార్యతో సంతోషంగా రాజ్యం ఏలు తుండేవాడు.ఎంత కాలమైన అతనికి సంతానం కలగలేదు.ఎన్ని పూజలు,హోమాలు,యజ్ఞాలు చేసినా ఎన్ని వ్రతాలూ చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సంతానం కలుగలేదు.ఒకనొక రోజు నారదున్ని కలిసి తనకు సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని అడుగుతాడు.
నారదుడు తగిన తరుణోపాయం వెదుకుచు కృత వీరుని పిత్రులోకాలకు వెళ్లి అక్కడ కృతవిరుని తండ్రి,తాత,ముత్తాతలు నరక భాదలు అనుబావిస్తూ ఉండడం చూసి కృత వీరుని తండ్రితో ఇలా అన్నాడు. భూలోకంలో నీ కుమారుడు సంతానం లేక త్రివమైన మనో వేదనను అనుబావిస్తునాడు,నీ కుమారునికి సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని నారదుడు అడుగుతాడు.అప్పడు కృత వీరుని తండ్రి నారుదునితో ,నా కుమారున్ని మహాగణపతి యూక్క సంకష్ట్టి వ్రతం చేయమని ,అలా వ్రతం చేస్తే తన కుమారినికి సంతానం కలుగుటే కాక,తనకు,తన తండ్రి ,తాత ముత్తాతలకు నరకలోక భాదలనుండి విముక్తి లబించగలదు అని తెలుపుతాడు.
నారదుడు భూలోకం వెళ్లి కృతవీరునితో శ్రీ మహాగణపతి యొక్క సంకష్ట్టి వ్రతం చేయమని,ఈ వ్రతం చేయమని నీ తండ్రి తెలిపాడు అని కృతవీరునితో అన్నాడు.అప్పడు కృత వీరుడు ఎంతో సంతోషించి ఈ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలో తెలుపామని నారదుణ్ణి అడుగుతాడు
ఈ వ్రతం శ్రావణ బహుళ చవితి రోజుగాని మాఘ బహుళ చవితి రోజు మంగళవారం నాడు చంద్రోదయం పూట తలస్నానం చేసీ ఉపవాసం వుండి,సంకల్పం చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం చేసుకొని తిరిగి స్నానం ముగించుకొని గణపతి ని ప్రాద్దిoచాలి.అదర్వ శీర్షంతో గణపతి ని అభిషేకించాలి .శ్రీ గణపతి మహామంత్రాన్ని జపించాలి.శ్రీ మహా గణపతికి బెల్లంతో చేసినా వంటకాలు,లడ్డులు,మోదకలు సమర్పించాలు.ముఖ్యంగా ఈ పూజలో తెల్ల జిల్లేడుతో పూలను,తుమ్మి పూలను పెట్టాలి అలాగే గరికను తప్పని సరిగా పెట్టాలి.గరికను పెట్టక పోతే వ్రతం నిష్పలం అవుతుంది.అని నారదుడు కృతవీరుని తో అన్నాడు.
కృత వీరుడు ఈలా ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం వరకు జరిపించి, సంతానం పొందాడు అని,అలాగే తన పితృ,తాత,ముత్తతలు నరకం నుంచి తప్పించాడని గణపతి పురాణంలోని ఈ ఒక కధ చెబుతుంది
ఎలాంటి విఘ్నాలు ఉన్న,చదువు రావాలన్న,సిరి సంపదలు కావాలన్నా ,ఆరోగ్యం కావాలన్నా,ముఖ్యంగా సంతానం కావాలని కోరుకొనే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం ఈ సంకష్ట్టి వ్రతం.
No comments:
Post a Comment