Sample Text

మన ఆచారాలు మరియు సంప్రదాయలు -గుళ్ళలో,ఆలయలలో ప్రదక్షణలు ఎ విధంగా చేయలి-ఇంటికి పచ్చ తోరణాలు ఎందుకు కడతారు -తీర్థ యాత్రలలో మన సంప్రదాయాలు -గ్రహణ సమయములో ఉపవాసములు ఎందుకు ఉండాలి -గృహప్రవేశం ఎప్పుడు చేయలి -పురుడు నియమం ఎవరికీ ఉంటుంది -ఉత్తర దిక్కు తల పెట్టి నిద్ర పోకూడదు -ప్రితృ కర్మలు -తులసి మొక్క ప్రాముఖ్యం -రావి చేట్టు చుట్టూ ప్రదక్షణలు ఎందుకు -మన వివాహ సంప్రదాయాలు -పుట్టినరోజు ఎలా జరుపుకొవాలి -భగవంతునికి పూజాపద్దతులు -ఉదయం లేవగానే చూడదగినవి -ఇంక మరి ఇంకా ఎన్నో విషయాలు ఇక్కడ తెలిసుకోవచ్చు

మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ- అశుభ సూచకములు


మనం నడిచే దారిలో స్త్రీ నెత్తిన మంచి నీళ్ళా బిందే కానీ కుండతో  కానీ మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి శుభ సూచకం

మనం నడిచే దారిలో వితంతువు ( ఒక వేళా గుండు చేయిoచు కొన్న) మనలల్ని దాటుకుని వెళ్ళిన అధి అశుభం.

మనం నడిచే దారిలో మంగళివాడు తన  సామగ్రితో మనకు ఎదురు పడినా అధి శుభ సూచకం

ఎవరైనా మన దారిలో ఒక మైనా పక్షుల జంటను చూసినా అధి శుభ సూచకం

మన ప్రవేశ ద్వారం(ఇంటి గడప ) మీద నిలబడి తుమ్మిన అధి అశుభం.దీన్ని నివారించాలంటే అదే గడప మీద నిలబడి నెత్తిన పసుపు నీటిని చల్లు కోవాలి

మన ఇంటిలోకి ప్రవేశించుచున్న ఆవు శుభ సూచకంగా మన పెద్దలు చెప్పుతారు

మన దేవాలయంలో దేవుడికి వేసిన పూలు,దేవుడి కి కుడి ప్రక్కన  క్రింద పడినచో అది శుభ సూచకం

మనం నడిచే దారిలో ఆవును,ఆవుతో పాటు దూడను ఒకే సారి చూచిన ఎడల అది శుభ సూచకం

మన రహదారిలో ముంగిస కనపడిన ఎడల అది శుభ సూచకం

మన ఇంటిలో కానీ ,కార్యాలయాల్లో కానీ బల్లి అరిచిన అది అశుభం.

మన ఇంటి ఆరు బయట కాకి ,అదే పనిగా అరుస్తుంటే మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అని సంకేతంగా చెప్పుకోస్తారు మన  పెద్దలు

మన ఇంటిలో పెంచుకొనే పెంపుడు కుక్క మనం బయటకు వెళ్ళేతప్పుడు తుమ్మిన  అది మనకు శుభ సూచకం

No comments:

Post a Comment